Abn logo
Jun 4 2020 @ 03:06AM

సొంత స్థల ముంటే.. ఇల్లు కట్టివ్వరు!

  • వారికి రెండో విడతలో..

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): సొంత స్థలాలున్న పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం విషయంలో మళ్లీ నిరాశే ఎదురుకానుంది. ప్రస్తుతానికి లేఅవుట్లలో ఇళ్లు పూర్తిచేస్తే, తర్వా త సొంత స్థలాల వారి విషయం చూద్దామని ప్రభుత్వం భా విస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇల్లు కట్టుకోవచ్చని అనుకున్న పేదలు మరో ఏడాది ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి స్థలాలు అందుకోనున్న పేదలకు ఆ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేస్తారు. తాజాగా సీఎం జగన్‌ వద్ద జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్ర భుత్వం ఇవ్వబోతున్న 25 లక్షల స్థలాల్లో తొలి విడత 15 ల క్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 2021లో రెండో విడత ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తారు. మిగిలిన 10 లక్షల ల బ్ధిదారులతోపాటు సొంత స్థలాలున్నవారికి రెండో విడతలో ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సొంత స్థలాలుండి ఇళ్లు కట్టుకోవాలనుకునే వారు ప్రభుత్వ రాయితీ కావాలనుకుంటే మరో ఏడాది ఆగాల్సిందే. అప్పటికి కూడా 15 లక్షల ఇళ్లు సక్రమంగా పట్టాలెక్కితేనే రెండో విడత ప్రారంభమవుతుంది. లేదంటే ఇంకా ఆలస్యం కావొచ్చనేది అధికారవర్గాల అంచనా. తాజా నిర్ణయంతో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు తీవ్ర నిరాశకు గురయ్యారు.


రాయితీ భారీగా చూపేందుకేనా?

గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రూ.2.5 లక్షలు, ఇతరులకు రూ.2 లక్షల చొప్పున ఇంటికి రాయితీ ఇచ్చింది. వైసీపీ ఒక్కో ఇంటికి రూ.2-5 లక్షల లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. దాని ప్రకారం టీడీపీ ప్రభుత్వం కంటే ఎంతో కొంత ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అం దుకు ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఇంటి స్థలాన్ని కూడా రాయితీగా చూపించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కనీసం రూ.2 లక్షలు రాయితీ ఇస్తే, అందులో రూ.50వేలు తగ్గించి రూ.లక్షన్నర చేయాలని ప్రతిపాదించింది. దానికి ఇంటి స్థలం విలువ మరో లక్షన్నర కలిపితే రూ.3లక్షలు దాటి చూపించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. సొంత స్థలాలున్న వారి నిర్మాణాలు చేపడితే రాయితీ   తక్కువ ఇచ్చారనే అపవాదు వస్తుందనే ఈ ఆలోచన చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement