Abn logo
Sep 21 2020 @ 20:10PM

పెద్దిరెడ్డి, బొత్సకు కీలక శాఖల కేటాయింపు

Kaakateeya

అమరావతి: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సెక్రటరీ, వలంటీర్ల శాఖ బాధ్యతలు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సకు అప్పగించారు. గ్రామ సెక్రటరీలు, వలంటీర్ల బాధ్యతలను పెద్దిరెడ్డికి కేటాయించగా, వార్డు సెక్రటరీలు, వలంటీర్ల బాధ్యతలను బొత్సకు కేటాయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement
Advertisement