Abn logo
Apr 6 2020 @ 22:03PM

ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా కేసులు

అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా కేసులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది.  ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా కేసులను తీసుకోవాలని ఆదేశించింది. కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా అనుమానం, నిర్థారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్థారించింది. కనీసం రూ. 16 వేల నుంచి గరిష్టంగా రూ.2.16 లక్షలుగా నిర్ణయించింది. 


కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ కేసులు 303కు చేరుకున్నాయి. సోమవారం మొత్తం 37 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్కరోజే  కర్నూలులో 18, నెల్లూరు-8, ప.గో-5, కడప-4, కృష్ణా-1, ప్రకాశంలో ఒక పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకూ జిల్లాల వారీగా చూసుకుంటే.. కర్నూలు 74, నెల్లూరు 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, విశాఖ 20, చిత్తూరు 17, ప.గో. 21, తూ.గో. 11, అనంతపురంలో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ కేసులన్నింటినీ కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

Advertisement
Advertisement
Advertisement