Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద మృతుల కుటుంబాలకు లక్ష ఇస్తాం.. అండగా ఉంటాం: చంద్రబాబు

కడప: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలోని వరదప్రాంతాల్లో పర్యటించారు. అన్నమయ్య ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యంతో పాటు అధికారుల నిర్లక్షమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ తరపున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు అందజేస్తామని చెప్పారు. నష్టపోయిన కుటుంబాలకు కూడా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 


ఇటీవల కురిసిన వర్షం కారణంగా రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంగళవారం కడపలో పర్యటించిన చంద్రబాబు తిరుపతి, నెల్లూరులోనూ పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు.  


Advertisement
Advertisement