Abn logo
Mar 26 2020 @ 12:01PM

సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ కీలక ప్రకటన!?

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 5గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే దేశం మొత్తం లాక్‌డౌన్ ఉండటం, ఏపీలో కూడా సర్వం బంద్  అయ్యాయి. ఈ క్రమంలో నిత్యావసర సరకుల రేటులు ధరలను వ్యాపారులు భారీగా పెంచేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే జనాలు, విద్యార్థులు రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఆగిపోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం మీడియా మీట్‌లో వీరిని ఉద్దేశించి కూడా జగన్ ప్రసంగిస్తారని తెలుస్తోంది.


కీలక ప్రకటన చేస్తారా..!?

అయితే ఈ విషయాలతో పాటు కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ ప్రకటన ఏమై ఉంటుంది..? ఏం ప్రకటించబోతున్నారు..? అనేదానిపై ఏపీ ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసర సరకుల పంపిణీ, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై కూడా జగన్ మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ నటులు విరాళాలు ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయంపై కూడా జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే.. షూట్ ఎట్ సైట్ పరిస్థితులు తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రజలకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.

Advertisement
Advertisement
Advertisement