Abn logo
Apr 6 2020 @ 18:53PM

సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. హిందూ ఆలయాల్లో క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటును ఆయన తప్పుబట్టారు. శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల్లో క్వారంటైన్‌ కేంద్రాలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భక్తుల మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దారుణమని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement