Abn logo
Dec 2 2020 @ 15:41PM

మండలి వైస్ ఛైర్మన్‌ను చూసి నేర్చుకోండి స్పీకర్ సార్..

అమరావతి: సభలో గొడవ జరిగితే దాన్ని డీల్ చేయాల్సిన పెద్దలు ఎలా వ్యవహరించాలో మండలి వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆచరణలో చూపించారు. ఆయన టీడీపీ వ్యక్తి అయినా.. ఒకసారి రాజ్యాంగబద్ద పదవిలోకి వెళితే ఏ పార్టీ తప్పు చేసినా చెప్పాలన్నది ఆయన ఖచ్చితంగా పాటించారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ మాట్లాడినదాంట్లో తప్పు.. దానికి మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన కౌంటర్ కూడా తప్పని తేల్చి చెప్పారు. అది కూడా పద్ధతి ప్రకారం చెప్పారు. కానీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అలాంటివి చేసినట్లు మనకు మచ్చుకు కూడా కనపడదు. పైగా ఎదురు మంత్రులు, ఎమ్మెల్యేలకన్నా ఎక్కువ డోసులో ప్రతిపక్ష నేతపై విరుచుకుపడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement