Abn logo
Mar 26 2020 @ 03:28AM

ఉపాధి కూలి రూ.237

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధి పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుకు రూ.237 వంతున చెల్లించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది గరిష్ఠంగా రూ.26 పెంచారు. గతేడాది తెలుగు రాష్ట్రాల్లో రూ.211 ఉండేది. రాష్ట్రంలో 2017-18 సంవత్సరంలో రోజుకు రూ.197, అలాగే 2018-19లో రూ.205 చెల్లించారు.

Advertisement
Advertisement
Advertisement