Abn logo
Oct 22 2020 @ 05:51AM

సరస్వతీదేవిగా అమ్మవారు

Kaakateeya

నంద్యాల(కల్చరల్‌)/పాణ్యం/మిడుతూరు/కొత్తపల్లి/పగిడ్యాల/బనగానపల్లె/ఆత్మకూరు(పాములపాడు)/బండి ఆత్మకూరు/ ఆళ్లగడ్డ/ఉయ్యాలవాడ/శిరివెళ్ల/ చాగలమర్రి/ అక్టోబరు 21 :

నంద్యాల పట్టణంలో శరన్నవరాత్రులు ఐదో రోజ బుధవారం బ్రహ్మనందీశ్వరాలయంలో మహాలక్ష్మీదేవి సరస్వతీ దేవిగా, కాళికాంబ చంద్రశేఖరస్వామి దేవస్థానంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా, బాలాజీకాంప్లెక్‌ కళ్యాణ మండపంలో గాయత్రీదేవిగా, అమ్మవారిశాలలో సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలం కారంలో పూజించారు. అమ్మస్పటికలింగేశ్వరాలయంలో, మద్దులేటి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు  సరస్వతీదేవిగా దర్శనమి చ్చారు. సంజీవనగర్‌ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వరునికి వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. 


దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం పాణ్యంలో కనకదుర్గ ఆలయంలో అమ్మవారు బాలత్రిపురసుందరిగా, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. అలాగే పాణ్యం గ్రూపు దేవాలయాల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. 


మిడుతూరు మండలంలోని అలగనూరు గ్రామంలోని ఆలయంలో అమ్మవారు పార్వతీదేవిగా దర్శనమిచ్చారు. అర్చకుడు త్రివేణ్‌ కుమార్‌ కుంకుమార్చన నిర్వహించారు. 


దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా బండి ఆత్మకూరు మండలం లో ఐదో రోజు పలు చోట్ల అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం నల్లమల అటవీప్రాంతంలోని ఓంకార క్షేత్రంలో ఉమామహేశ్వరి, పద్మావతి అమ్మవారు, సిద్ధయ్య ఆశ్రమంలోని కామాక్షి అమ్మవారు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనం ఇచ్చారు. 


దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు ఉయ్యాలవాడ మండల కేంద్రంలోని మారెమ్మ, ఇంజేడు గ్రామంలోని చౌడేశ్వరీదేవి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అనంతయ్య, ఓబులేసు అమ్మ వారికి అభిషేకం చేశారు. 


దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా శిరివెళ్ల, యర్రగుంట్ల గ్రామాల్లోని వాసవీమాతకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వీరారెడ్డిపల్లె గ్రామంలోని కోదండ, కళ్యాణ రామాలయాల్లో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి మహిళలు బుధవారం పూజలు నిర్వహించారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 


చాగలమర్రి గ్రామంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం బిల్వవృక్షనివాసిని, అన్నపూర్ణాదేవి అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు జనార్దన్‌, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. చెన్నకేశవ ఆలయంలో పల్లకి మహోత్సవం, అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొండయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముత్యాలపాడు కన్యకాపరమేశ్వరి ఆలయంలో పార్వతిదేవి అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. 


బనగానపల్లె మండలంలోని నందవరం చౌడేశ్వరిమాత దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఐదో రోజు బుధవారం స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ఈవో రామానుజన్‌, చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.


పాములపాడులోని  చౌడేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఐదో  రోజు బుధవారం లలితా దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, ఆకుపూజ, పుష్పార్చన నిర్వహించారు. 


పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్‌లోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారు బుధవారం మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.100, 500, 2000 నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ముచ్చుమర్రి గ్రామంలో త్ర్తెలోక్య గౌరీదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు.


కొత్తపల్లి మండలంలోని నల్లమలలో కొలువైన కొలనుభారతి అమ్మవారు బుధవారం సరస్వతిదేవి అలంకారంలో దర్శన మిచ్చారు. ఆలయ ఈవో గుర్రెడ్డి పర్యవేక్షణలో పురోహితులు ప్రత్యేకంగా అలంకరించి విషేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ లింగస్వామి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ పట్టణంలోని వాసవికన్యాకాపరమేశ్వరి ఆలయంలో బీజేపీ యువ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి బుధవారం అమ్మవారికి పూజలు చేశారు. ఈయన రాకను పురస్కరించుకొని ఆలయపూజారి ఘనంగా స్వాగతించారు. ఈయన వెంట పుట్టాలమ్మ క్షేత్ర మాజీ చైర్మన్‌ అంబటి మహేశ్వరరెడ్డి ఉన్నారు.


అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దసరా నవరాత్రులనువైభవంగా నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌ మంగళవారం తెలిపారు. ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేస్తామని తెలిపారు. 


రుద్రవరం మండల కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం గౌరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

Advertisement
Advertisement