Abn logo
Oct 22 2020 @ 05:44AM

చెరువులు, కాలువలకు రూ.45.50 కోట్లు

మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిన ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి 


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 21: భారీ వర్షాలకు జిల్లాలో  దెబ్బతినిపోయిన చెరువులు, జలాశయాలు,  కాలువల మరమ్మతులకు  రూ.45.50 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు  ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. మైనర్‌ ఇరిగేషన్‌ విభాగానికి  సెప్టెంబరులో వర్షాల వల్ల జరిగిన నష్టానికి   మరమ్మతు పను లకు రూ.32.29 కోట్లు, అక్టోబరులో  జరిగిన నష్టానికి మరమ్మతు పనులకు రూ.1.22 కోట్లు ఖర్చుతో  ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబరులో చెరువులకు జరిగిన నష్టానికి రూ.2కోట్ల ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన తెలిపారు. భారీ నీటి పారుదల శాఖకు   సెప్టెంబరులో జరిగిన నష్టానికి  రూ.11.20 కోట్లతో పనులు  చేపట్టడానికి  ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. ఈ మూడు విభాగాలకు  కలిపి రూ.45.50 కోట్ల పనులకు ప్రభుత్వానికి నివేదిక పంపామని ఎస్‌ఈ తెలిపారు.  

Advertisement
Advertisement