Abn logo
Oct 22 2020 @ 05:44AM

కొడుకు సంసారం బాగలేదని తండ్రి ఆత్మహత్య

మద్దికెర, అక్టోబరు 21: మద్దికెరలోని సాయినగర్‌లో నివసించే మస్తాన్‌ (62) తన కొడుకు సంసారం సరిగాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మస్తాన్‌, నూర్‌బీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడికి సమీప బంధువుల అమ్మాయితో ఆరేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే కొడుకు, కోడలు మధ్య గొడవలు వచ్చి, కోడలు రెండేళ్ల క్రితం కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మస్తాన్‌ మనోవేదనకు గురయ్యాడు. బుధవారం  శివార్లలో పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు మద్దికెర ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అనంతరం గుంతకల్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే కోలుకోలేక మృతి చెందాడు. భార్య నూర్‌బీ ఫిర్యాదు మేరకు  ఎస్‌ఐ మస్తాన్‌వలి కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Advertisement
Advertisement