Abn logo
Oct 22 2020 @ 05:32AM

బ్రహ్మంసాగర్‌ను పరిశీలించిన ఎస్‌ఈ

బ్రహ్మంగారిమఠం, అక్టోబరు 21:  బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ను బుధవారం ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ శారద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం బ్రహ్మంసాగర్‌లో 12.4 టీఎంసీలు నీటి నిల్వ ఉందన్నారు. రాబోయే రోజుల్లో నీటి నిల్వ మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోజూ బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు ప్రత్యేకించి ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలు ఉన్నారన్నారు. వారు ఎప్పటికప్పుడు బ్రహ్మంసాగర్‌ నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తుంటారన్నారు. 

Advertisement
Advertisement