Abn logo
Oct 22 2020 @ 05:32AM

ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దేవి ప్రసాద్‌

కడప (క్రైం), అక్టోబరు 21:  జిల్లా నూతన అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా ఎం.దేవిప్రసాద్‌ బుధవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ని కలిసి పుష్పగుచ్చం అందించారు. ఎం.దేవిప్రసాద్‌ 1989 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎంపికై శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. అనంతరం సీఐగా పదోన్నతి పొంది అదే జిల్లాల్లో వివిధ సర్కిళ్లల్లో విధులు నిర్వర్తించారు. డీఎస్పీగా పదోన్నతి పొందిన తరువాత సీఐడీ, ఏసీబీలలో పనిచేశారు. ఏసీబీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా కడప జిల్లాకు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement