Abn logo
Sep 21 2020 @ 06:13AM

61,046 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధం

డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు 

జేడీఏ శ్రీరామమూర్తి వెల్లడి


ఒంగోలు, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో ఎరువులు పుష్కలం గా అందుబాటులో ఉన్నట్లు జేడీఏ డా క్టర్‌ శ్రీరామమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వివిధ కంపెనీల హోల్‌సెల్‌, రిటైల్‌ డీలర్లు, ప్రభుత్వ సంస్థల వద్ద 61,046 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు పే ర్కొన్నారు. ఈనెల కోటా కింద 51,629 మెట్రిక్‌ టన్నులు కేటాయింపు జరగ్గా శనివారం నాటికి 29,195 మెట్రిక్‌ ట న్నులు వచ్చాయన్నారు. ఆదివారం మంగళ కంపెనీకి చెందిన 1,160 ట న్నుల యూరియా, నాగార్జున కంపెనీ కి చెందిన యూరియా 1,434 టన్ను లు ఒంగోలు రైల్వే గూడ్స్‌ షెడ్‌కు చే రిందన్నారు. కాగా మొత్తంగా ప్రస్తు తం జిల్లాలో 61,046 టన్నులు వివిధ రకాల ఎరువులు నిల్వ ఉన్నాయన్నా రు. అందులో ఆయా ప్రాంతాల్లోని రి టైల్‌ డీలర్ల వద్ద 35,300 మెట్రిక్‌ ట న్నులు ఉండగా హోల్‌సెల్‌ డీలర్ల వద్ద 11,981, ఆగ్రోస్‌ వద్ద 1,258, మార్క్‌ఫె డ్‌ వద్ద 3,118 టన్నులు ఉన్నట్లు వివ రించారు. ఎరువుల కృత్రిమ కొరతను ప్రైవేటు డీలర్లు సృష్టించకుండా శాఖ పరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా డీలర్లు అధిక  ధ రలకు అమ్మినా, బయో ఉత్పత్తులను బలవంతంగా ఈ ఎరువులతో అమ్ము జూపినా తమ దృష్టికి తీసుకొనిరా వా లని ఆయన రైతులను కోరారు. 

Advertisement
Advertisement
Advertisement