Abn logo
Apr 5 2020 @ 12:58PM

ప‌వ‌న్27లో అనుష్క‌..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కొన్నిరోజుల‌కు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఆగింది. కోవిడ్ 19 ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ట‌. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్స్ గురించి ప‌లు రకాల వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. జాక్వెలైన్‌, కీర్తి సురేష్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. కాగా ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ హీరోయిన్ ఖ‌రారైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు.. అనుష్క శెట్టి. గ‌తంలో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వేదంలో అనుష్క న‌టించింది. ఆ ప‌రిచ‌యంతోనే క్రిష్ అడ‌గ‌టంతో మ‌రోసారి ఆయన సినిమాలో న‌టించ‌డానికి ఓకే అన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే ఎదురు చూపులు త‌ప్పేలా లేవు.


Advertisement
Advertisement
Advertisement