Abn logo
Sep 23 2020 @ 11:26AM

స్పెషల్ డే.. అనుష్క ఫ్యాన్స్‌ స్పెషల్ విషెష్‌

Kaakateeya

అగ్ర కథానాయిక అనుష్క శెట్టి స్పెషల్ డే సందర్భంగా స్పెషల్‌ విషెస్‌ చెప్పారు. ఇంతకూ ఈ రోజుకున్న ప్రాముఖ్యతటేమిటో తెలుసా? ఈరోజు 'ఇంటర్నేషనల్‌ సైన్‌ లాంగ్వేజ్‌ డే'. ఈ సదర్భంగా అనుష్క ఫ్యాన్స్‌ హ్యాపీ 'ఇంటర్నేషనల్‌ సైన్‌ లాంగ్వేజ్‌ డే' అని తెలిపారు. ప్రత్యేకంగా అనుష్క ఫ్యాన్స్‌ ఇలా అభినందనలు చెప్పడానికి కారణం, ఆమె నిశ్శబ్దం చిత్రమే. ఈ సినిమాలో అనుష్క మాటలు మాట్లాడలేని, చెవులు వినపడని సాక్షి అనే దివ్యాంగురాలి పాత్రలో నటించారు. సినిమాలో ఎదుటివారితో అనుష్క సంజ్ఞలతోనే మాట్లాడుతుంది. అందుకనే ఆమె ఫ్యాన్స్‌ ఇలా స్పెషల్‌గా విషెష్‌ చెప్పారు. 'నిశ్శబ్దం' సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో..  అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా డైరెక్ట్‌ విడుదల కానుంది. హేమంత మధుకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. మాధవన్‌, షాలినిపాండే, అంజలి, అండ్రూ హడ్సన్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు. 


Advertisement
Advertisement
Advertisement