Sep 17 2021 @ 13:23PM

కోలీవుడ్‌కు 'జేజేమ్మ' రీఎంట్రీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో 'అరుంధతి', 'జేజేమ్మ', 'దేవసేన' ఇలా వివిధ పాత్రలు పోషించి, ఆ పాత్రల పేరుతో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. ఈమె గతంలో కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య వంటి అగ్రహీరోల సరసన నటించారు. అయితే, ఈ మధ్య కాలంలో అనుష్క తమిళ చిత్రాల్లో కనిపిన్చలేదు. అదే సమయంలో 39 యేళ్ళ అనుష్క త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదిలావుంటే, గతంలో రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార నటించిన ‘చంద్రముఖి’ చిత్రం రెండో భాగం తెరకెక్కనుంది. ఇందులో హీరోగా రాఘవ లారెన్స్‌తో పాటు హాస్య నటుడు వడివేలు నటిస్తుండగా, దర్శకుడు పి.వాసు తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా అనుష్క పేరును ఖరారు చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ యేడాది ఆఖరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదే నిజమైతే తమిళ చిత్రపరిశ్రమలోకి అనుష్క సుధీర్ఘకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చినట్టే. చూడాలి మరి దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు వస్తుందో.