Advertisement

మాటలు రావడం లేదు: అనుష్కశెట్టి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి శుక్రవారం విడుదలైన ‘జనని’ సాంగ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు స్వీటీ అనుష్కశెట్టి. పాట విన్నాక తనకు మాటలు రావడం లేదని భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. హీరో నిఖిల్‌ కూడా ఈ పాటపై స్పందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘జనని’ పాటన తనకెంతో నచ్చిందని ప్రశంసిస్తూ నిఖిల్‌  ట్వీట్‌ చేశారు. దేశభక్తిని చాటేలా ఈ పాట ఉందని, ఇప్పటికే 20 సార్లు విన్నట్లు తెలిపారు. విన్న ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయని ట్వీట్‌ చేశారు నిఖిల్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేేస చిత్రమవుతుందని భావిస్తున్నానని అన్నారు. తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా డి.వి.వి. దానయ్య నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌, తారక్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ కీలక పాత్రలు పోషించారు. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement