Abn logo
Mar 6 2021 @ 14:39PM

బుమ్రా, అనుపమ పెళ్లి చేసుకోవడం లేదట!

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాది ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరి పెళ్లి గురించిన వార్త సంచలనం సృష్టిస్తోంది. అనుపమను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకే ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. తను ద్వారక వెళ్లబోతున్నట్టు ఇటీవల అనుపమ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పెళ్లి కోసమే వీరిద్దరూ తమ తమ పనులను పక్కనపెట్టారని వార్తలు మొదలయ్యాయి. 

ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో తాజాగా అనుపమ తల్లి స్పందించారు. బుమ్రాతో అనుపమకు పెళ్లి అని వచ్చిన వార్తలను ఖండించారు. అలాంటిదేమీ లేదని, ఓ సినిమా షూటింగ్ కోసమే అనుపమ గుజరాత్ వెళ్లిందని చెప్పారు. కాగా, బుమ్రా ప్రేమలో పడింది అనుపమతో కాదని.. సంజనా గణేశన్ అనే స్పోర్ట్స్ ప్రెజెంటర్‌తోనని మరో వార్త తాజాగా ప్రచారంలోకి వచ్చింది. మరి, వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే బుమ్రా స్పందించాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement