Abn logo
May 29 2020 @ 04:30AM

వాపు తగ్గించే మందులతో కరోనాకు చెక్‌?

లండన్‌, మే 28: వాపును తగ్గించే రెండు ఔషధాలు (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌) కరోనా పునరుత్పత్తిని అడ్డుకుంటాయని తాజా అధ్యయనంలో తేలింది. వాటిలో ఒకటి మనుషులకు ఇచ్చే ఔషధం కాగా.. మరొకటి జంతువులకు వాడే మందు. కొవిడ్‌-19పై 6466 రకాల ఔషధాల ప్రభావాన్ని కంప్యూటర్‌ టెక్నిక్స్‌ ఆధారంగా పరిశీలించిన స్పెయిన్‌ శాస్త్రజ్ఞులు.. ఈ రెండు ఔషధాలకు ఆ సామర్థ్యం ఉందని గుర్తించారు. కరోనా మన శరీరంలోకి ప్రవేశించాక తన సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. దాన్ని నిర్వీర్యం చేసే ఔషధాన్ని కనుగొనేందుకు స్పెయిన్‌లోని రొవిటా వర్సిటీ పరిశోధకులు 6466 ఔషధాలను కంప్యూటర్‌ ద్వారా పరీక్షించారు. మొత్తం ఏడు ఔషధాలకు ఆ శక్తి ఉందని వారి అధ్యయనంలో తేలింది. 


Advertisement
Advertisement
Advertisement