''అంటే.. సుందరానికీ'' అప్‌డేట్స్ ఎప్పుడొస్తాయో..!

'అంటే.. సుందరానికీ' మూవీ నుంచి అప్‌డేట్స్ ఎప్పుడొస్తాయో..! అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారట. ఇది నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం. ఈ సినిమాతో టాలీవుడ్‌కు మలయాళ బ్యూటి నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా 'బ్రోచేవారెవరురా' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఎప్పుడో ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఓ అనౌన్స్ మెంట్ వీడియో మాత్రమే వచ్చింది. ఆ తర్వాత నుంచి నో అప్‌డేట్స్. దాంతో ఈ ప్రాజెక్ట్ ఉందా..పట్టాలు తప్పిందా అనే సందేహాలు మొదలయ్యాయి. మరి దీనిపై మేకర్స్ స్పందిస్తూ అప్‌డేట్స్ ఎప్పుడిస్తారో చూడాలి. కాగా, నాని నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ్ రాయ్' ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. 

Advertisement
Advertisement