Abn logo
Sep 21 2020 @ 22:50PM

శ్రియాతో అంత్యాక్షరి.. ఆశ్చర్యపోయిన శర్మ

Kaakateeya

పెళ్లి అయినప్పటికీ తన వయసులో వన్నె తరగని హీరోయిన్‌ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అందరూ శ్రియా శరణ్‌ పేరే చెబుతారు. తన మొదటి చిత్రంలో ఎలా అయితో ఉందో ఇప్పటికీ అలానే ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తుంది శ్రియ. పెళ్లి చేసుకున్నా కూడా తనలో ఎటువంటి మార్పు లేదు. అందుక్కారణం ఆమె చేసే మెడిటేషన్‌, యోగా, డ్యాన్స్ వంటివే అని చెబుతుంటుంది శ్రియ. అలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండటం కూడా ఓ కారణమని చెబుతుంది. తాజాగా ఆమె అంత్యాక్షరి విత్‌ శర్మాజీ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో శర్మాతో చిట్‌ చాట్‌ చేసింది. ఆమెతో చేసిన చిట్‌ చాట్‌కి శర్మాజీ ఆశ్చర్యపోయానంటూ తెలపడం విశేషం.

ఈ ఫన్ చిట్‌ చాట్‌లో ఆమె గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ఆమెకు ఎన్నో విషయాలు తెలుసని ఆయన చెప్పడం చూస్తుంటే.. శ్రియా పవరెంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో రజినీకాంత్‌, మమ్ముట్టి, నాగార్జున మరియు అమితాబ్‌ అంటే తనకు ఎంత ఇష్టమో తెలిపిందని, ఆమె అన్ని రకాల పాటలు పాడుతుందని, డ్యాన్స్ చేస్తుందని.. ప్రతి విషయం మీద ఆమెకు పట్టుందని శర్మా తెలిపారు. అంతేకాదు కంప్లీట్‌ రాక్‌స్టార్‌గా ఆమెను ఆయన వర్ణించారు.


Advertisement
Advertisement
Advertisement