Abn logo
May 23 2020 @ 19:59PM

బీఎస్ఎఫ్‌లో మరో 21 మంది జవాన్లకు కరోనా

న్యూఢిల్లీ: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్‌ఎఫ్)లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు తాజాగా మరో 21 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గత 24 గంటల్లో బీఎస్ఎఫ్‌లో కొత్తగా 21 మంది జవాన్లకు కరోనా సోకింది. వారందరినీ గుర్తింపు పొందిన కొవిడ్‌-19 హెల్త్‌కేర్‌ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది. కాగా నేడు నమోదైన 21 కేసులతో కలిపి బీఎస్‌ఎఫ్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 406కు చేరింది. అయితే, వారిలో 286 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 120 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement