Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

అమరావతి: ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. పాలవలస విక్రాంత్‌ (శ్రీకాకుళం), ఇషాక్ బాషా (కర్నూలు), డీసీ గోవిందరెడ్డి (కడప) ఎంపిక చేశారు. రెండు రోజుల్లో మిగిలిన 11 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబరు 10న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మంగళవారం జారీ చేసిన షెడ్యూల్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటికి ఈ నెల 29న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 16న నామినేషన్లు స్వీకరిస్తారు.  

TAGS: YCP MLC

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement