Abn logo
Apr 2 2020 @ 06:52AM

కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 నేడు రామాలయంలో ధ్వజారోహణం   

అర్చకుల సమక్షంలో ఉత్సవమూర్తుల గ్రామోత్సవం   

భక్తులకు అనుమతి నిరాకరణ   

 ఒంటిమిట్ట: ఏకశిలానగిరి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా బుధవారం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ ఈవో లోకనాధం ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు అర్చకులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మొదట ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొనివచ్చి ఉదయం 3 గంటలకు సుప్రభాతసేవతో పరివాహ దేవతలను మేల్పొలి స్వామివారి పూజలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, వ్యాస అభిషేకం చేశారు.    సాయంత్రం పుట్టమన్ను అర్చకులు గ్రామంలో నుంచి తీసుకున్న అనంతరం రామాలయంలో ఉన్న పుట్ట నుంచి పుట్ట మన్ను సేకరించి ఆగమశాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించి అంకురార్పణకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి 9గంటల వరకు ధ్వజారోహణం రామాలయంలో నిర్వహించిని అనంతరం రాత్రి శేష వాహనంపై రామాలయంలో ఉత్సవమూర్తులకు అర్చకులు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. రామాలయానికి భక్తులకు అనుమతి లేకుండా శాస్త్రోక్తంగా స్వామి వారికి పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాఘవచార్యులు, శ్రావణ్‌కుమార్‌, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement