Abn logo
Jun 9 2020 @ 11:05AM

కీళ్ల నొప్పులా?

Kaakateeya

ఆంధ్రజ్యోతి(09-06-2020): కీళ్లు వాచి, కదల్చలేనంతగా నొప్పి పెడుతూ ఉంటే ఆయుర్వేద చికిత్సలను ఆశ్రయించవచ్చు. వాపు తగ్గి, కదలికలు సులువయ్యేలా చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఇవి కొన్ని!


ఉలవలు: 100 గ్రాముల అడవి ఉలవలను పొడి చేసి, 50 గ్రాముల నువ్వుల నూనె కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దతో కీళ్ల మీద పట్టు వేసి, పలుచని వస్త్రం చుట్టాలి. ఇలా రాత్రంతా ఉంచితే ఉదయానికి వాపు, నొప్పి తగ్గుతాయి.


అందుగ బంక: అందుక చెట్టు బంక సేకరించి, 10 గ్రాముల బంకను 100 మిల్లీ లీటర్ల నీళ్లలో కలిపి, సగం అయ్యే వరకూ మరిగించి, చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్లను తాగాలి. ఇలా వారం రోజులు తాగితే కీళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయి.


ఆముదం బెరడు: ఆముదం చెట్టు బెరడు 100 గ్రాములు, రేల చెట్టు వేర్లు 100 గ్రాములు తీసుకుని, ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. 30 గ్రాముల చూర్ణాన్ని 200 మిల్లీ లీటర్ల నీళ్లలో కలిపి రాత్రంతా కదలకుండా ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని పావు వంతు అయ్యేవరకూ మరిగించి, వడగట్టి తాగాలి. ఇలా 20 రోజుల పాటు క్రమం తప్పక చేస్తే కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయి.

Advertisement
Advertisement