Advertisement
Advertisement
Abn logo
Advertisement

కంచె చేను మేసినట్లు రాష్ట్రంలో పరిస్థితి: వంగలపూడి అనిత

అమరావతి: కంచె చేను మేసినట్లు రాష్ట్రంలో పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డలను రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తున్న మహిళలను పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దాడులు చేయించడం, కేసులు పెట్టడం చూస్తుంటే.. ఇది సైకో ప్రభుత్వమని చాలా సందర్భల్లో రుజువైందన్నారు.


దేవాలయం లాంటి అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అవమానం జరిగిందని, రేపు వాళ్లకు జరగదని చెప్పగలరా? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. క్యారెక్టర్ లేని వెధవలు భువనేశ్వరిని దూషిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో టీడీపీ మహిళ నేతలపై పోలీసులతో దాడులు చేయించారని, వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి, వ్యాపారాలపై దెబ్బకొట్టడానికి సిగ్గనిపించడంలేదా? అని అనిత ప్రశ్నించారు.

Advertisement
Advertisement