Advertisement
Advertisement
Abn logo
Advertisement

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మళ్లీ అస్వస్థత

అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీలో బిశ్వభూషణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో  చికిత్స పొంది  డిశ్చార్జయ్యారు. మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. 


కాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఈ నెల 17న కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు లక్షణాలు కనిపిచండంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స పొందారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లారు. మళ్లీ ఇప్పుడు అస్వస్థతకు గురయ్యారు. 

Advertisement
Advertisement