Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపిందా?

అమరావతి/హైదరాబాద్: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అమరావతి నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విజయవంతంగా సాగిన ఈ మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలో ఎంటర్ కావడంతో అలజడి మొదలైంది. ఈ పాదయాత్రపై పోలీసులు, వైసీపీ నేతలు జులుం విదుల్చుతున్నారంటూ రైతులు అంటున్నారు. కోర్టు అనుమతి ఉన్నా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. 

ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘చిత్తూరు జిల్లాలోకి ఎంటరవగానే ఎందుకీ అలజడి?. ముగింపు సభకు అనుమతించేది లేదని పోలీసులు ఎందుకంటున్నారు?. రాజకీయ పార్టీలతో లేని ఇబ్బంది రైతులతో వస్తుందా?. రైతుల పాదయాత్రపై కొందరు రాయలసీమ నేతల అభ్యంతరాలేంటి?. అవివేకాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో కొత్త వివాదానికి తెరలేపిందా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement