Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీటిలో బొమ్మై.. గాలిలో జగన్

అమరావతి: వరదలతో అస్తవస్త్యంగా మారిని బెంగళూరు నగరంలో జరుగుతున్న సహాయ చర్యలను కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై స్వయంగా పరిశీలిస్తున్నారు. స్వయంగా వరద నీటిలో ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాల్లో బాధితుల పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో వరద ముంపు ప్రాంతాల్లో కేవలం ఏరియల్ సర్వేకు సీఎం జగన్ పరిమితంకావడం చర్చనీయాంశమైంది. 


వర్షాలు, వరదలు ఇటు ఏపీలోనూ అటు కర్ణాటకలోనూ బీభత్సం సృష్టించాయి.  నగరాలు, పట్టణాలు జలగండంలో చిక్కుకున్నాయి. తిరుపతి జలదిగ్బంధమైంది. సముద్రాన్ని తలపించేలా కడపలో దృశ్యాలు కనిపించాయి. అటు బెంగళూరు నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. బెంగళూరులో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం బస్వరాజు బొమ్మై స్వయంగా పర్యటించారు. మోకాలి లోతు నీటిలో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ఇటు ఏపీలో సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో కేవలం ఏరియల్ సర్వేకు పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Advertisement
Advertisement