Abn logo
Nov 1 2020 @ 02:26AM

వెబ్‌ చిత్రంలో అనసూయ

Kaakateeya

టెలివిజన్‌, సినిమా రంగాల ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చిన అనసూయ వెబ్‌లో కూడా అడుగుపెట్టారు. ఆమె నటించిన ఓ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదల కానుందని సమాచారం. థియేటర్లు మూతపడడం మూలాన అనేక చిత్రాలు ఓటీటీల ద్వారా విడుదలవుతున్నాయి. కొన్ని చిత్రాలను కేవలం ఓటీటీల కోసమే నిర్మిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో అనేకమంది నటులు ఓటీటీ చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ జాబితాలో అనసూయ కూడా చేరారు.

Advertisement
Advertisement