Abn logo
Sep 21 2021 @ 12:27PM

అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల భూ కుంభకోణం

అనంతపురం జిల్లా: రాయదుర్గం పట్టణంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఖాళీగా కనబడితే చాలు.. గద్దల్లా వాలిపోతున్నారు. అధికార పార్టీ భూ దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. విప్ కాపు రామచంద్రారెడ్డి సమీప బంధువులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారి కన్నుపడితే ఆ భూమి కబ్జా అవ్వాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారింది.


రాయదుర్గం పట్టణంలోని 497/498/499 సర్వే నెంబర్లలోని అరకోటి రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపు రామచంద్రారెడ్డి  సమీప బంధువులు కబ్జా చేశారు. ఈ వ్యవహారంలో రామచంద్రారెడ్డి పీఏ రామకృష్ణారెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు సమాచారం. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని చదును చేయించి ప్లాట్లుగా విభజించి నిర్మాణ పనులు ప్రారంభించారు. రామచంద్రారెడ్డి బంధువు ధనుంజయ రెడ్డి అదే సర్వే నెంబర్‌లో 8 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని, అనుమతులు లేకుండా భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మున్సిపల్ యంత్రాంగం కనుసన్నల్లోనే ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక తహసీల్దార్ సుబ్రహ్మణ్యం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం.


ఇవి కూడా చదవండిImage Caption