Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనంతలో మిన్నంటిన TDP నిరసనలు

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు మిన్నంటాయి. పెనుకొండలో హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆడపడుచులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చెప్పులతో కొడతాం అంటూ హెచ్చరించారు. అనంతపురం నగరంలో అరగుండు కొట్టించుకుని తెలుగు యువత నిరసన వ్యక్తం చేసింది. మంత్రి కొడాలి నాని చిత్రపటానికి తెలుగు యువత నాయకులు చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం  చేశారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై టీడీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

TAGS: TDP anantapur
Advertisement
Advertisement