Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: బంగారు గొలుసు అపహరణ

అనంతపురం: కళ్యాణదుర్గం లోని పూలవాండ్ల వీధిలోని ఇంటి ముందు బుధవారం వివాహిత చంద్రకళ తులసి చెట్టుకు పూజ చేసి, దీపాలు వెలిగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. రమే్‌షబాబు, చంద్రకళ  దంపతులు పూలవాండ్ల వీధిలో నివాసముంటున్నారు. కార్తీకమాసం సందర్భంగా రోజూ ఉదయం 5 గంటల సమయంలో చంద్రకళ తులసి చెట్టుకు పూజ చేసి, దీపాలు వెలిగిస్తుండేది. బుధవారం కూడా దీపాలు వెలిగిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీనిపై బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement