Abn logo
Aug 11 2021 @ 14:08PM

అంతులేకుండా పోతున్న వైసీపీ నేతల ఆగడాలు

అనంతపురం: వైసీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అనంతపురం, సప్తగిరి సర్కిల్‌లో అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం షాపులను మూసివేయించారు. స్థానిక వైసీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలికారు. ఇటీవల ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీం అహమ్మద్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఇదే తరహాలో దుకాణాలను మూసివేయించారు. కరోనా సమయంలో వ్యాపారాలు సజావుగా సాగక ఇబ్బందిపడుతుంటే.. వైసీపీ నేతల కార్యక్రమాల కోసం దుకాణాలు మూసివేయించడం ఏంటని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణస్వీకారానికి, తమ వ్యాపారాలకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.