అనంతపురం: వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు పాల్గొనద్దని సూచించారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినట్టయితే 8500292992, 08554220009 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వార్డు వాలంటీర్లపై [email protected], [email protected] ద్వారా లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయవచ్చని కలెక్టర్ గంధం చంద్రుడు వినతి చేశారు.