Abn logo
May 24 2020 @ 04:11AM

కరోనా కట్టడిలో వైద్య సిబ్బందే దేవుళ్లు

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌


వికారాబాద్‌ : ప్రస్తుత ఆపత్కాలంలో వైద్య సిబ్బందే దేవుళ్లని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం సబితా ఆనంద్‌ హాస్పిటల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లును శాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించి అనంతరం వారితో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి మన కోసం కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.


ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శాంతప్ప, అరవింద్‌, వినోద్‌, నాయకులు చిగుళ్లపల్లి రమేష్‌, విజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ పాండు, మోముల రాజ్‌కుమార్‌, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గోపాల్‌, చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మణ్‌, నర్సిములు, వేణుగోపాల్‌, సుభాన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement