Abn logo
May 9 2021 @ 12:50PM

ఆయన స్థాయి‌ అర్థం చేసుకోండి: ఆనం వెంకటరమణారెడ్డి

నెల్లూరు: సీఎం జగన్, మంత్రులు, సలహాదారులు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తప్పించి ఏమీ చేయలేరని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సలహాతో ఒరిస్సా, ఢిల్లీ సీఎంలు ఆర్డర్ ఇచ్చారంటే ఆయన స్థాయి‌ అర్థం చేసుకోవాలన్నారు. ఏపీలో వందల మంది కరోనాతో మృతిచెందుతుంటే... 2,3,4 అని దొంగలెక్కలు చూపుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. డబ్ల్యూహెచ్‌వో ‘హూ ఈజ్ జగన్’ అని సన్మానం చేయబోతుందట... జగన్‌కి చెడ్డపేరు తేవాలని వందల‌ మంది వాళ్లకై వాళ్లే చనిపోయి శ్మశానాలకి వెళుతున్నారా? శ్మశానాల్లో కూడా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

Advertisement
Advertisement
Advertisement