Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయ్యన్న ఇంటి ముట్టడికి యత్నం

నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్న టార్గెట్‌గా వైసీపీ నేతల దౌర్జన్యాలు సాగుతున్నాయి. శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడికి పాల్పడిన వైసీపీ నేతలు.. శనివారం అయ్యన్నను టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఉమాశంకర్ ఫోన్ చేసి, అయ్యన్నపై ఫిర్యాదు చేశారు. 


టీడీపీ నేతలు మాట్లాడుతూ అయ్యన్న వ్యాఖ్యల్లో అభ్యంతరం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం, శాంతియుత ఆందోళనలు చేయడం...రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోందన్నారు. కానీ ఇలా దౌర్జన్యాలకు పాల్పడడడం వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకంటే.. ప్రస్తుతం అయ్యన్న ఎక్కువగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలను పరామర్శలకు కూడా అంగీకరించని పోలీసులు.. వైసీపీ నేతలకు మాత్రం గొడలవలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement