Abn logo
Sep 17 2021 @ 23:42PM

ఐస్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌

ఫ్యాక్టరీ నుంచి లీకవుతున్న అమ్మోనియా గ్యాస్‌

పరుగులు తీసిన కార్మికులు


ఆకివీడురూరల్‌, సెప్టెం బరు 17 : ఐస్‌ ఫ్యాక్టరీలోని అమ్మోనియా గ్యాస్‌ లీకై కార్మికులు పరుగులు తీశా రు.ఆకివీడు మండలం అజ్జ మూరు –కుప్పనపూడి గ్రా మాల మధ్య  రహదారిని ఆనుకుని ఉన్న ఐస్‌ ఫ్యాక్ట రీలో  అమ్మోనియా సిలిం డర్‌ పైపు నుంచి గ్యాస్‌ లీకై ప్యాక్టరీ అంతా దట్టంగా తెల్లని మంచుపొరలా కమ్మేసింది.దీంతో సమీపంలోని ప్రజలు, వాహన దారులు భయ బ్రాంతు లకు గురయ్యారు. ఫ్యాక్టరీ సిబ్బంది రహదారిపై ఉండి హెచ్చరించడంతో వాహనదారులు అజ్జమూరు, కుప్పనపూడి గ్రామాల వైపు వెళ్లి పోయారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి నీటిని పంప్‌ చేయడంతో గాలిలో వ్యాపించిన అమ్మోనియా వాయువు పలుచబడింది. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది సిలిండర్‌ వద్దకు చేరుకుని లీకేజీని అదుపు  చేశారు. రూ.10 వేలు ఆస్తినష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.