Abn logo
Aug 5 2020 @ 21:35PM

పేదవాళ్లకు అమితాబ్ చేసిన సాయం ఏమిటి?

ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. తాజాగా ఓ మహిళ అమితాబ్ దాతృత్వం గురించి ప్రశ్నించింది. `పేదవాళ్లకు మీరు చేస్తున్న సహాయం ఏమిటి?` అని ప్రశ్నించింది. 


ఈ ప్రశ్నకు స్పందించిన అమితాబ్ తన బ్లాగులో సుదీర్ఘ పోస్ట్ చేశారు. తను చేస్తున్న సహాయాల గురించి బయటపెట్టారు. `నా దాతృత్వం గురించి మాట్లాడకపోవడాన్ని ఈ రోజు ఓ మహిళ ప్రశ్నించింది. చేసిన సహాయం గురించి పబ్లిసిటీ చేసుకోకూడదని నేను నమ్ముతాను. కానీ, మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు వచ్చింద`ని అమితాబ్ పేర్కొన్నారు. `ఆంధ్రప్రదేశ్, విదర్భ, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులకు సహాయం చేశాం. సినీ పరిశ్రమకు చెందిన పది వేల కుటుంబాలకు ఆరు నెలలుగా రేషన్, ఆహారం అందిస్తున్నాం. ముంబై నుంచి తమ స్వగ్రామాలకు కాలినడకన బయల్దేరిన వలస కార్మికులకు 12,000 జతల చెప్పులు అందించాం. నాసిక్ హైవే మీద వాళ్లకు ఆహారం, నీళ్లు అందించాం. చార్టెర్డ్ ఫ్లైట్‌లు బుక్ చేసి వీలైనంత మందిని వారి స్వగ్రామాలకు తరలించాం. కరోనా యోధులకు 15 వేల పీపీఈ కిట్స్, 10 వేల మాస్క్‌లు అందించామ`ని అమితాబ్ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement