Abn logo
Oct 23 2020 @ 05:01AM

పోలీసు సేవా యాప్‌ను వినియోగించుకోండి

ఎచ్చెర్ల: నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ పోలీసు సేవా యాప్‌ను ప్రజలు విని యోగించుకోవాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎచ్చెర్ల సాయుధ పోలీసు కార్యాలయంలో గురువారం ఓపెన్‌ హౌస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతుందని, దానికి అనుగుణంగా ప్రజలు కూడా అభి వృద్ధి చెందాలన్నారు. నేరపరిశోధనలో వినియోగించే ఆయుధాలు, డాగ్‌ స్క్వాడ్‌ తది తర వాటిని ఓపెన్‌ హౌస్‌లో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌, ఎస్‌బీ సీఐ శంకరరావు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.  రణస్థలం: అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా  పలువురు విద్యార్థులు జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌ను గురువారం సందర్శించారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించిన రికార్డుల వివరాలను ఎస్‌ఐ శ్రీనివాసరావు విద్యార్థులకు వివరించారు. వజ్రపుకొత్తూరు : యువతకు చట్టాలపై అవగాహన అవసరమని ఎస్‌ఐ కూన గోవిందరావు అన్నారు.


గురువారం పోలీసుస్టేషన్‌ ఆవరణంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ ఇచ్ఛాపురం : చట్టాలు, పోలీసుల విధులుపై విద్యార్థులకు ఇచ్ఛాపురం రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మి వివరించారు. గురువారం స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సర్వభారతి విద్యార్థులు పాల్గొన్నారు. ఫ పాలకొండ : పాలకొండ స్టేషన్‌లో ఎస్‌ఐ జనార్దన్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫ భామిని : బత్తిలి ఎస్‌ఐ కేవీ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement