Abn logo
May 20 2020 @ 21:35PM

ఏ తప్పు చేయకపోయినా.. భారత్‌లో ఏడు నెలల జైలుశిక్ష అనుభవించిన అమెరికన్ పాస్టర్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో చేయని తప్పుకు ఏడు నెలల జైలుశిక్ష అనుభవించిన అమెరికన్ పాస్టర్ బ్రైన్ నెర్రెన్‌కు ఎట్టకేలకు విముక్తి కలిగింది. బ్రైన్ చేయని తప్పుకు శిక్ష అనుభవించారని జడ్జి తీర్పునివ్వడంతో బ్రైన్ తిరిగి తన స్వదేశానికి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్‌లో భారతదేశంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు బ్రైన్ పశ్చిమ బెంగాల్‌ వచ్చారు. అంతకుముందు ఆయన నేపాల్ వెళ్లడంతో.. అక్కడి నుంచి నేరుగా భారత్‌కు వచ్చారు. ఇదే సమయంలో ఆయన వివిధ దేశాల కరెన్సీలను వెంబ బెట్టుకుని ఉండటంతో అధికారులకు ఆయనపై అనుమానం కలిగింది. ఆ డబ్బులు క్రైస్తవులకు సంబంధించిన ఫండ్స్ అని చెప్పినా అధికారులు వినలేదు. క్రైస్తవ మతం గురించి, ఆయన గురించి ప్రశ్నించారు. బ్రైన్ చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ ఉల్లంఘన కింద బ్రైన్‌ను అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ ఐదో తేదీ నుంచి బ్రైన్ పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి నగరంలో ఉన్న జైల్లోనే శిక్ష అనుభవిస్తూ వచ్చారు. ఆయనను చూసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వకపోవడం.. పైగా ఆయన అమెరికాకు చెందిన వాడు కావడంతో బ్రైన్ జైల్లోనే గడుపుతూ రావాల్సి వచ్చింది. ది అమెరికన్ సెంటర్ ఫర్ లా అండ్ జస్టిస్(ఏసీఎల్‌జే) బ్రైన్‌ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. ఇలా ఏడు నెలలు గడిచిపోగా.. ఎట్టకేలకు కోర్టు బ్రైన్ నిర్దోషి అని తేల్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే బ్రైన్ అమెరికా వెళ్లిపోయారు.

Advertisement
Advertisement
Advertisement