న్యూఢిల్లీ: కరోనా వైరస్ చైనా నుంచే వ్యాప్తి చెందిందని ప్రపంచమంతా నమ్ముతూవస్తోంది. అయితే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఇచ్చిన రిపోర్టు ఇందుకు బిన్నంగా ఉంది. సీడీసీ... కరోనాకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి గత ఏడాది డిసెంబరులోనే అమెరికాలో వ్యాప్తిచెందిందని తెలిపింది.
ఇంతకాలం అమెరికా... ఈ కరోనా వైరస్‌కు చైనానే కారణమని ఆరోపిస్తూవస్తోంది. అయితే సీడీసీ తెలిపిన ఈ వివరాలతో చైనా, అమెరికాల మధ్య మరో వివాదం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడీసీ ఈ అధ్యయనం కోసం రెడ్‌క్రాస్ సాయంతో 7,389 బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి, పలు పరిశోధనలు నిర్వహించింది. ఈ శాంపిల్స్‌లోని 106 నమూనాలలో వైరస్ కనుగొన్నారు.