Abn logo
Sep 26 2020 @ 05:18AM

27న అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష

 పాలమూరుయూనివర్సిటీ, సెప్టెంబరు 25: ఈ నెల 27న అంబేడ్కర్‌ ఓపెన్‌ యూ నివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నామని, అభ్యర్థులు ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్‌ను డౌన్‌ లోడ్‌  చేసుకోవాలని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివ ర్సిటీ ఉమ్మడి జిల్లా రీజనల్‌ కో- ఆర్డినేటర్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకట న లో తెలిపారు. అలాగే డిగ్రీ, పీజీ కోర్సుల విద్యార్థులు అక్టోబర్‌ 15లోగా ఆన్‌లైన్‌లోనే సెమిస్ట ర్‌ రిజిస్ర్టేషన్‌, ఫీజులు చెల్లించాలని తెలిపారు. 18సంవత్సరాలు నిండిన వయోజనులు అ ర్హులని, తక్కువ ఖర్చుతో ఉన్నతవిద్యను అభ్యసించవచ్చన్నారు. విద్యార్హతలు  పెంచుకోవా ల్సిన వారు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement