Abn logo
Aug 7 2020 @ 02:21AM

వేటకుక్కలై వేటాడతారు..జాగ్రత్త!

  • ఏపీ సీఎం జగన్‌కు రఘురామ హెచ్చరిక
  • నరసాపురం ఎంపీకి కేంద్ర బలగాల భద్రత

న్యూఢిల్లీ, ఆగస్టు6 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి గారూ...అమరావతి రైతులకు దగాచేసి, వారిని అనేక విధాలుగా అవమానం పాలు చేస్తే...అక్కడ మహిళా రైతులంతా వేట కుక్కలై మిమ్మల్ని వేటాడే పరిస్థితి దగ్గరపడింది’’ అని ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. భూములిచ్చిన రైతులు, మహిళా రైతులను కుక్కలతో పోల్చుతూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో రోడ్డున పడిన రైతులకు మనోధైర్యం కల్పించేందుకు తాను త్వరలోనే మనోధైర్యయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. కాగా,  రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఆయనకు ‘వై‘ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.


Advertisement
Advertisement
Advertisement