Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అమరావతి జేఏసీ

నెల్లూరు: మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని , అసెంబ్లీ, హైకోర్టు అన్నీ ఇక్కడే ఉండాలన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మార్చుకుని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోసంగా ఉందన్నారు.


ఏ ప్రభుత్వమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. అమరావతిని త్వరగా అభివృద్ధి చేయాలని, అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని, రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement