Abn logo
Jul 13 2020 @ 13:35PM

అడ‌విలో అమ‌లాపాల్ క‌ష్టాలు..!

సెంచురీ ఇంటర్‌నేషనల్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై జోన్స్‌ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘అదో అంద పరవై పోల’. ఈ చిత్రానికి కే.ఆర్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అందాల భామ అమలాపాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతోపాటు ఆశిష్‌ విద్యార్థి, సమీర్‌ కొచ్చర్‌, ప్రవీణ్‌ తదితరులు నటించారు. పారిశ్రామికవేత్తగా ఉన్న అమలాపాల్‌ దట్టమైన అడవిలోకి వెళ్లి తిరిగి రాలేకపోవడం, అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు, చివరకు ఎలా బయటపడుతుందనే అంశాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు వినోద్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement