Abn logo
Oct 17 2021 @ 01:33AM

గురువులకు పూర్వ విద్యార్థుల సన్మానం

 ఓబుళదేవరచెరువు,  అక్టోబరు 16: విద్యాబుద్దులు నేర్పి తమ విద్యాభివృ ద్ధికి కృషి చేసిన గురువులకు పూర్వ వి ద్యార్థులు శనివారం ఘనంగా సన్మానించారు. మండలంలోని మామిళ్ళకుంట్లపల్లిలో అప్పటి విద్యార్థులు ఇటీవల పదవీ విర మణ పొందిన ఉపాధ్యాయులు సాయిబాబా ఆయన సతీమణి విజయలక్ష్మీ దంపతులతో పాటు దివంగత రా మచంద్రరాజు సతీమణి ఈశ్వరమ్మకు దుశ్శాలు వ, పూలమాలలతో ఘనంగా స న్మానించారు. ఈ సందర్భంగా గురువు సా యిబా బా మాట్లాడుతూ దశాబ్ధాలు గ డిచినా విద్యార్థులు తమపై చూపుతున్న ఆదరణ అభిమానం మరువలేనివన్నారు. వారి ప్రేమ అనురాగం ముందు ఏదీ వెల కట్టలేమన్నారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో నందికొట్కూరు సర్కిల్‌ ఇన్‌స్పె క్టర్‌ ప్రసాద్‌, గోపాల్‌, రవీ, పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.