Abn logo
Oct 24 2020 @ 18:00PM

యువత కోసం నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆల్స్టోమ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ

Kaakateeya

గుంటూరు: ఆల్స్టోమ్ ఎపీఎస్ఎస్డీసీతో భాగస్వామిగా శ్రీ సిటీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కోసం నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 30 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడానికి మరియు శ్రీ సిటీలో ఉపాధి అవకాశాలను అందించడానికి పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆల్స్టోమ్ పేర్కొంది. 


ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో 'ఆల్స్టోమ్' ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సహకారంతో యంగ్ డిప్లొమా ఇంజినీర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి అనంత రాము, ఐఏఎస్ చక్రధర్ బాబు, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ చల్లా మదుసుధన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


ఆల్స్టోమ్ యొక్క శ్రీసిటీలో భారతీయ మరియు అంతర్జాతీయ కస్టమర్ల కోసం సాంకేతికంగా అభివృద్ధి చెందిన మెట్రో ట్రైన్సెట్లను అభివృద్ధి చేస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని మెరుగుపర్చడంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నామని ఆల్స్టోమ్, ఇండియా అండ్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్పాహర్ అన్నారు.


45 రోజుల శిక్షణా కార్యక్రమంలో సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగుల ఆరోగ్యం అండ్ భద్రత (ఇహెచ్ఎస్), నాణ్యమైన ఫండమెంటల్స్, రైల్వే భద్రత, అలాగే ఆల్స్టోమ్ కార్యకలాపాల పరిచయం వంటి తరగతి గది శిక్షణలు ఉంటాయి. అదనంగా శిక్షణ పొందినవారు ఎపీఎస్ఎస్డీసీ శిక్షకులు అందించే ఇంటర్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్ మరియు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై అనేక సెషన్లకు హాజరవుతారు. మార్చి 2021 నాటికి ఈ కార్యక్రమం ద్వారా మరో 50 మంది డిప్లొమా ఇంజినీర్లతో నిమగ్నమవ్వాలని కంపెనీ ఎదురుచూస్తోంది.

Advertisement
Advertisement